Friday, June 21, 2013

Hrudaya Kaleyam Trailor


Superb Interview APJ Abdul Kalam

రాష్ట్రపతి అనే పదవి రబ్బరు స్టాంపు కాదని, దేశప్రజలను ఉత్తేజితం చేసే శక్తి దానికి ఉందని చాటి చెప్పిన ఆదర్శనీయుడు అబ్దుల్ కలాం. యుద్ధ విమానం లో ప్రయాణించి సైనికులలో స్ఫూర్తి నింపినా, విదేశీ పర్యటనల కంటే విశ్వవిద్యాలయాలు ఎక్కువ సందర్శించినా ఆయనకే చెల్లింది. రాష్ట్రపతి పదవికే ఒక గ్లామర్ తెచ్చిన కలాం గారి ఇంటర్వ్యూ మీ కోసం...

Monday, June 17, 2013

చైనా వారి పొదుపు

1980 ల ప్రారంభం నుండి చైనా దాని జాతీయ పొదుపు రేటు వేగంగా పెరుగుదలను చవిచూశాయి. వారి పొదుపు రేట్ ఇప్పుడు  ప్రపంచంలో అత్యధిక రేట్లలో ఒకటిగా ఉంది. అయితే ఆ పొదుపు 1980ల కు ముందులా ప్రభుత్వ నిర్భంధం వల్ల కాక ప్రజలు స్వచ్చందంగా చేస్తున్నదిగా గుర్తించాలి. ప్రస్తుతం చైనా వేగంగా అభివృద్ది చెందుతున్న దేశం. ఇలాంటి దేశాలలో సహజంగానే వేతనాలు ఎక్కువ ఉంటాయి, జీవన ప్రమాణాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అయితే వీటితో పాటు ప్రపంచీకరణ (Globalization: Selling Branded Items at a high cost) కూడా ప్రవేశించి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టించడానికి సిద్ధంగా ఉంటుంది. చైనా ప్రజలు ఈ మాయలో చిక్కుకోకుండా వారి పొదుపుని అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు వారి సంస్కృతి కూడా ఇందుకు దోహదం చేస్తోంది.
గమనించాల్సిన చిత్రమైన సంగతి ఏంటంటే అన్ని ఆసియా దేశాలు భారత్, జపాన్ సహా వృద్ది రేటు ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ పొదుపు చేశాయి. నిజానికి సంపాదిస్తున్నప్పుడే బాగా పొదుపు చేయాలి అన్న మౌలిక సూత్రాన్ని మనం మరిచిపోయాం. మరిచిపోయేలా ప్రపంచీకరణ చేసింది అనడం ముదావహం. అయితే చైనీయులు ఈ తప్పు దారిలో నడవకుండా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే చైనా మీద ఇప్పుడు చాల దేశాల ఆర్ధిక స్థితులు ఆధారపడి ఉన్నాయి. చైనా కనుక కుప్ప కూలితే సగం ప్రపంచం కుప్పకూలినట్లే.
నిజానికి చైనాతో సమానంగా మన పొదుపు రేటు ఉంది ఒకప్పుడు (42% ఇండియా, 40% చైనా). మన పూర్వీకులు మనకి నేర్పిన మంచి అలవాటు పొదుపు చేయడం. ఇప్పుడు బళ్ళు ఓడలు అయ్యాయి. ప్రస్తుత చైనా పొదుపు రేటు 52%, కాగా మనం 36% కి పడిపోయాం. ఇందుకు చైనాలో నవయువతరం మీద ఇంకా పాత తరం ప్రభావం బాగా ఉంది. మన దగ్గర ఇంకేదో నేర్పుతున్నాం పిల్లలకి. పిల్లలు కూడా పెద్ద వాళ్ళని లెక్క చేసే పరిస్థితి లేదు. కొత్త సంస్కృతికి అలవాటు పడుతున్నాం. చైనా మిగతా ప్రపంచానికి దూరం గా ఉండడం ఒకరకంగా వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడానికి పనికి వచ్చింది.
ఎప్పుడయితే ఆదాయం నిలకడగా ఉంటుందో అప్పుడు పొదుపు ఎక్కువ చేయాలి. కాని చైనా లో నిలకడైన ఆదాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు రేటు మరీ ఎక్కువగా ఉంది. దీనికి రెండు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి గ్రామీణుల మీద ప్రపంచీకరణ ప్రభావం తక్కువగా ఉండడం, రెండు కుటుంబ వ్యవస్థ బాగా బలం గా ఉండడం.

స్టాక్ మార్కెట్ల మీద అవగాహన లేక పోవడం తద్వారా వచ్చే నష్టాల నుండి తప్పించుకోవడం కోసం కూడా చైనీయులు ఎక్కువగా ద్రవ్య రూపంలో (Liquidity) పొదుపు చేస్తున్నారు.
ఆదాయం పెరిగినప్పుడు పొదుపు కూడా పెరగడం లో గొప్పేం ఉంది అని మీరు ప్రశ్నించవచ్చు. ఇక్కడే చైనా గొప్పదనం ఉంది. వారి GDP పెరిగిన వేగం కన్నా వారి పొదుపు పెరగడం లో వేగం ఎక్కువ. కింద చిత్రం చూడండి.


కాబట్టి ప్రపంచానికి సరిగ్గా అపసవ్య దిశలో వెళ్తూ కూడా అభివృద్ది వైపు చైనా వెళ్ళడం వెనుక అక్కడి పాలకుల కఠిన నిర్ణయాలు, అద్భుతమైన మార్కెటింగ్ వ్యవస్థే కాక, చైనా ప్రజల కఠోర శ్రమ కూడా ఉందని మనం అర్ధం చేసుకోవాలి. చైనాలో కూడా భారత్ కంటే తక్కువ అవినీతి ఏం లేదు. కాక పోతే వారి నాయకులు మన నాయకుల కంటే చిత్తశుద్దిలో ముందున్నారు. వారి ప్రజలు మనలా పరాయి అలవాట్లు నేర్చుకోలేదు. అంతే తేడా!
Curtesy: China’s High Savings Rates by Rick Harbaugh
Prepared for conference on “The Rise of China Revisited: Perception and Reality”,
National Chengchi University, published in Chinese in conference volume, 2004

Saturday, June 15, 2013

నేను నా ఆలోచనలు...

అందరికీ నా నమస్కారం. మనిషికి జంతువుకి భగవంతుడు పెట్టిన తేడా ఆలోచనే. మనకి ఊహ వచ్చిన దగ్గరినుండి ఎన్నో ఆలోచనలు చేసి ఉంటాం. పుట్టిన దగ్గరి నుండి చనిపోయే వరకు మనం ఆలోచిస్తూనే ఉంటాం. నిజానికి మరణం అంటే గుండె ఆగిపోవడం కాదు, మన ఆలోచన ఆగిపోవడం. "నా ఇష్టం" లో రామ్ గోపాల్ వర్మ అంటాడు " నేను అంటే నా ఆలోచనే. నేను చిన్నప్పటి నుండి చూసిన సంఘటనలు, మనుషులు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కలిపితేనే నేను". ఒక మనిషిగా మనం ఆలోచించగలిగిన పరిధి చాలా తక్కువ ఉంటుంది. వేరే వాళ్ళ ఆలోచనలను కూడా చదివినప్పుడు, మన ఆలోచనలను వాళ్ళతో పంచగలిగినప్పుడు మాత్రమే ప్రతి వ్యక్తి ఒక్క ఆలోచనా పరిధీ విస్తృతం అవుతుంది. ఇదివరకు పుస్తకాలు ఈ పని చేసి పెట్టేవి.ఇపుడు నేను పుస్తకం రాస్తే అచ్చు వేసే వాడు ఎవడూ దొరకడు అని నమ్ముతూ ఈ బ్లాగుని ప్రారంభిస్తున్నాను. నా ఆలోచనలని చదవండి, మీ ఆలోచనలని కూడా నాతో పంచండి.